Arvind Kejriwal | ‘కేజ్రీవాల్ కోర్టు విచారణ వీడియోలు తొలగించండి’.. ఢిల్లీ హైకోర్టు ఆదేశం
Arvind Kejriwal | ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అనుమతి లేకుండా కోర్టు విచారణలను రికార్డ్ చేయడం నిషేధమని పేర్కొంది.
న్యూఢిల్లీ: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) సంబంధించిన కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అనుమతి లేకుండా కోర్టు విచారణలను రికార్డ్ చేయడం నిషేధమని పేర్కొంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కోర్టు వాదనలకు సంబంధించిన అనధికారిక రికార్డింగ్‌లను సోషల్ మీడియా నుండి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ స్వర్ణ కాంత శర్మను తప్పించాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏప్రిల్ 13న ఆయన స్వయంగా కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు.
కాగా, జస్టిస్ స్వర్ణ కాంత శర్మ, అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరిగిన కోర్టు విచారణ వీడియో, ఆడియో క్లిప్స్‌ను ఆప్ నేతలతో పాటు కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్ అయ్యాయి.
మరోవైపు ఒక వ్యక్తి దీనిపై హైకోర్టులో ఫిర్యాదు చేశారు. వీటిని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయడం, న్యాయవ్యవస్థ ప్రతిష్టకు హాని కలిగించడం దీని లక్ష్యమని ఫిర్యాదుదారు ఆరోపించారు. అనుమతి లేకుండా కోర్టు విచారణలను రికార్డ్ చేయడం నిషేధమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఫిర్యాదుదారు కోరారు. అలాగే ఆ క్లిప్‌లను షేర్ చేసిన పార్టీ నాయకులు, ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ హైకోర్టు ఈ ఫిర్యాదుపై స్పందించింది. కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అలాగే అనధికారికంగా రికార్డ్ చేసిన, షేర్ చేసిన వ్యక్తులపై చర్యలు చేపట్టాలని పేర్కొంది.
Also read:
Cop Kills Beggar | తాను మరణించినట్లుగా నమ్మించేందుకు.. బిచ్చగాడిని హత్య చేసిన డిస్మిస్ అయిన పోలీస్
Watch: ఒక్క రోజు వయసున్న ఖడ్గమృగం పిల్ల.. అరుదైన వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

