లక్నో: ఉద్యోగం నుంచి తొలగించిన ఒక పోలీస్, తాను మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. ఒక బిచ్చగాడిని హత్య చేశాడు. మృతదేహాన్ని తగులబెట్టాడు. తనకు సంబంధించిన వస్తువులను అక్కడ వదిలేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు అసలుగుట్టు రట్టుచేశారు. (Cop Kills Beggar) ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 12న నార్త్ ఈస్టర్న్ రైల్వేకు చెందిన హత్రాస్ రోడ్ హాల్ట్ సమీపంలోని ఒక రేకుల షెడ్డు వద్ద గుర్తు తెలియని వృద్ధుడి కాలిన మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. నేర ఆరోపణలతో పోలీస్ ఉద్యోగం నుంచి తొలగించిన 55 ఏళ్ల రామ్‌వీర్ సింగ్ గుర్తింపు కార్డు, వస్తువులు ఆ పక్కన పడి ఉండటాన్ని గమనించారు.
కాగా, ఈ సంఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేశారు. మైన్‌పురి జిల్లాలోని కిష్ని ప్రాంతానికి చెందిన రామ్‌వీర్ సింగ్ ఈ కుట్రకు పాల్పడినట్లు నిర్ధారించారు. తనను తాను మరణించినట్లుగా నమ్మించేందుకు ఒక బిచ్చగాడిని హత్య చేసి అతడి మృతదేహాన్ని తగులబెట్టినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఏప్రిల్ 14న అతడ్ని అరెస్టు చేశారు.
మరోవైపు పోలీస్ శాఖ నుంచి డిస్మిస్ అయిన రామ్‌వీర్ సింగ్‌కు నేర చరిత్ర ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఫిరోజాబాద్, అలీగఢ్, మొరాదాబాద్, హర్దోయ్, మెయిన్‌పురి, బదాయూన్ వంటి జిల్లాల్లో కిడ్నాప్, హత్య, దోపిడీ, మోసం వంటి తీవ్రమైన అభియోగాలతో అతడిపై పలు కేసులు నమోదయ్యాయని చెప్పారు.
అయితే తనను తాను మరణించినట్లుగా నమ్మించేందుకు రామ్‌వీర్ సింగ్ ఎందుకు ప్రయత్నించాడు, బిచ్చగాడిని ఎందుకు హత్య చేశాడు అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. తాజా నేర సంఘటనలో నిందితుడికి కాలిన గాయాలు అయ్యాయని చెప్పారు. సాధువు వేషధారణలో ఉన్న బిచ్చగాడైన మృతుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Girl Gives Birth | 14 ఏళ్ల బాలిక ప్రసవం.. దీనికి కారణమైన వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు
Watch: ‘మువ్వన్నెల’ రిబ్బన్ కత్తిరించేందుకు ఒమర్ నిరాకరణ.. ఆయన ఏం చేశారంటే?
Watch: ఒక్క రోజు వయసున్న ఖడ్గమృగం పిల్ల.. అరుదైన వీడియో వైరల్