గద్వాల, ఆగస్టు 14 : క్యాబినెట్ నిర్ణయంతోనైనా గట్టు ఎత్తిపోతల పథకం గట్టెక్కేనా అని నడిగడ్డ రైతులు అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా మూడుతట్టల మట్టి తీయకుండా ఈ పనులను పడకేపించిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన క్యా బినెట్ సమావేశంలో ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమ వుతో ంది. సామర్థ్యం పెంపుపై మరోవైపు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పనులు ప్రారంభమై తే తప్పా ప్రభుత్వాన్ని రైతులు నమ్మె పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలోని ఎత్తిపోతల జలాశయాల సామర్థ్యం పెం పునకు సమీక్షా సమావేశాల్లో నిర్ణయాలు తీసుకున్నా రే తప్పా.. క్షేత్రస్థాయిలో వాటి అమలుకు అడుగు లు పడలేదు. ప్రస్తుత క్యాబినెట్ నిర్ణయంతోనైనా అ డుగులు పడతాయనే ఆశతో నడిగడ్డ రైతులు, ప్రజ లు ఎదురు చూస్తున్నారు. గట్టు ఎత్తిపోతల పథకం జలాశయం 1.2 టీఎసీల నుంచి 3టీఎంసీలకు పెం చ డం, నెట్టెంపాడ్ పథకంలోని గుడ్డెందొడ్డి జలాశయం 1.03 టీఎంసీల నుంచి 15 టీఎంసీల సామర్థ్యానికి పెంచడంపై గతంలో నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం వాటికి క్యాబినెట్ ఆమోదించడంతో నడిగడ్డ రైతుల ఆశలు చిగిరిస్తున్నాయి.
వెనుకబడిన ప్రాంతంగా ఉన్న గట్టు, కేటీదొడ్డి, ధ రూర్ మండలాల్లో 33 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.554కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. అదే ఏడాది జూన్‌లో శంకుస్థాపన చేశారు. ర్యాలంపాడ్ రిజర్వాయర్ నుంచి నీ టిని ఎత్తిపోయడానికి పంప్‌హౌస్, అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ నిర్మాణం 1.32 టీఎంసీలతో రాయపురం వద్ద రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభించారు.
రాయపురం దగ్గర నిర్మిస్తున్న రిజర్వాయర్ పునాది నిర్మాణం పనులు పూర్తి చేశారు. కొంత రివిట్మెంట్ కట్ట నిర్మాణం చేశారు. 2023 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గట్టు ఎత్తిపోతల పథకం ఎత్తు పెంపు పేరుతో మూడేళ్లుగా పనులు పడకేపించారు. ప్రస్తుతం క్యాబినెట్లో దానిపై నిర్ణ యం తీసుకున్నారు. 1.32 టీఎంసీలకు డిజైన్ చేసి న గట్టు ఎత్తిపోతల పథకం ప్రస్తుతం దానిని రీ డిజై న్ చేసి మూడు టీఎంసీలకు పెంచడానికి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం రూ. 1,781 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించా రు. అయితే 1.32కు డిజైన్ చేసిన దానిని మూడు టీఎంసీలకు ఎలా మార్చుతారు అనే దానిపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకంలో భాగమైనా గుడ్డెందొడ్డి సామర్థ్యం పెంపుపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కన్సల్టెంట్‌ని నియమించింది. ప్రస్తుతం గుడ్డెందొడ్డి సామర్థ్యం 1.02 టీఎంసీలు ఉండగా దీనిని 15 టీఎంసీలకు పెంచడానికి క్యాబ్నెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఎత్తు పెంపు సాధ్యం, ఎత్తు పెంచితే ఎన్ని ఎకరాలు ముంపునకు గురవుతుంది, నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం, ఇప్పుడున్న జలాశయంలో ముంపునకు గురైన భూములు కా కుండా ఇంకా ఎంత భూమి సేకరించాల్సి ఉంటుం ది. ప్రస్తుత పరిస్థితుల్లో భూ సేకరణకు రైతులు అ ంగీకరిస్తారా? అనే దానిపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కన్సల్టెంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.
గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం 1.02 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచడంతోపా టు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియమించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పాటు లీకేజీల కారణం గా నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉండాల్సిన ర్యా లంపాడ్ రిజర్వాయర్‌లో రెండు టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచుతున్నారు. దీని మరమ్మతులు చేపట్టడంతోపాటు దీని సామర్థ్యం అదనంగా మరో 1నుంచి రెండు టీఎంసీలు పెంచడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గట్టు, గుడ్డెందొడ్డి, ర్యాలంపాడ్ ఎత్తిపోతల పథకాల పెంపును నడిగడ్డ రైతులు, ప్రజలు స్వాగతిస్తున్నారు. కానీ అదే సమయంలో పనులు వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకోవాలని నడిగడ్డ రైతులు కోరుతున్నారు.