Car, Bus Catches Fire | ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కారు.. చెలరేగిన మంటలు, 9 మంది మృతి
Car, Bus Catches Fire | అదుపుతప్పిన కారు, ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగడంతో ఆ రెండు వాహనాలు కాలిపోయాయి. కారులో ప్రయాణించిన ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. మృతుల్లో నలుగురు పిల్లలున్నారు.
బెంగళూరు: అదుపుతప్పిన కారు, ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగడంతో ఆ రెండు వాహనాలు కాలిపోయాయి. కారులో ప్రయాణించిన ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. మృతుల్లో నలుగురు పిల్లలున్నారు. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం సురపూర్ తాలూకాలోని శాంతాపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కుటుంబం ప్రయాణిస్తున్న కారు టైర్ పేలిపోయింది. అదుపుతప్పిన ఆ కారు ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. కారు, ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి.
కాగా, కారులో ప్రయాణించిన ఒకే కుటుంబానికి చెందిన పది మందిలో 9 మంది మరణించారు. కారులో చిక్కుకున్న ఇద్దరు పిల్లలతో సహా నలుగురు సజీవదహనమయ్యారు. మృతులను కృష్ణ నాయక్ (52), ఆయన భార్య అనంత కళ (45), శరణప్ప (36), ఆయన భార్య నిసర్గ (30), వారి పిల్లలు సిద్ధార్థ (3), అద్విక్ (5), శ్రీనిధి (1.5), శశికళ (30), ఆమె కుమారుడు చందన్ (8)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. శశికళ మరో కుమారుడైన విరాట్ (10) ఒక్కడే ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. గాయపడిన ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు కారులో ప్రయాణించిన వారు రాయచూర్ జిల్లాలోని సిర్వార్ తాలూకాకు చెందినవారని పోలీస్ అధికారి తెలిపారు. యాద్గిర్ నుంచి రాయచూర్లోని వారి స్వగ్రామానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.
అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి కలబురగికి ప్రయాణిస్తున్నది పోలీస్ అధికారి తెలిపారు. ఆ బస్సులోని 20 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, వారిని సకాలంలో రక్షించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, కారు, బస్సు మంటల్లో కాలిపోయిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
In a horrific road accident, six people were killed after a car collided head-on with a private bus and caught fire in Karnataka’s Yadgir district. The incident occurred in Devapur village of Surpur taluk.
According to initial reports, the car was travelling from Yadgir to… pic.twitter.com/3nkdkMqSyI
— Hate Detector 🔍 (@HateDetectors) April 17, 2026
Also Read:
Riddle of 16 | లోక్సభలో ‘16’ సంఖ్యను ప్రస్తావించిన రాహుల్ గాంధీ.. దాని చిక్కుముడి ఏమిటంటే?
Watch: థార్తో ఐదుగురిని ఢీకొట్టిన ఎమ్మెల్యే కొడుకు.. హారన్ మోగిస్తున్నా ఎందుకు తప్పుకోలేదంటూ వాదన
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bus
- car
- Catches Fire
- collision
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

