Valparai Tragedy | కొండ మలుపు నుంచి కిందకు దూసుకెళ్లిన వాహనం.. ఏడుగురు టీచర్స్‌తో సహా 9 మంది మృతి
Valparai Tragedy | ఒక టూరిస్ట్ వాహనం కొండ మలుపులో అదుపుతప్పింది. కిందకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఉపాధ్యాయులతో సహా 9 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రభుత్వ స్కూల్లో విషాదం నెలకొన్నది.
చెన్నై: ఒక టూరిస్ట్ వాహనం కొండ మలుపులో అదుపుతప్పింది. కిందకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఉపాధ్యాయులతో సహా 9 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రభుత్వ స్కూల్లో విషాదం నెలకొన్నది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Valparai Tragedy) కేరళలోని మలప్పురం జిల్లా పాంగ్-పల్లిపరంబ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బందితో కూడిన 13 మంది పర్యటన కోసం తమిళనాడు వెళ్లారు. శుక్రవారం ట్రావెల్ టెంపో వాహనంలో వాల్పరై హిల్ స్టేషన్‌ను సందర్శించారు.
కాగా, వాల్పరైలో పర్యటన ముగించుకుని కొండ నుంచి కిందకు దిగుతుండగా ఆ వాహనం ప్రమాదానికి గురైంది. 13వ హెయిర్‌పిన్ మలుపు వద్ద అది అదుపుతప్పి కిందకు దూసుకెళ్లింది. 9వ హెయిర్‌పిన్ మలుపులోని రోడ్డుపై బోల్తాపడింది. ఆ వాహనంలో ఉన్న 13 మందిలో ఒక బాలిక, ఏడుగురు మహిళలు, ఒక పురుషుడితో సహా 9 మంది ఈ ప్రమాదంలో మరణించారు. మృతుల్లో ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.

Kerala Teachers Killed
మరోవైపు ట్రావెల్ వాహనం డ్రైవర్, మరో ముగ్గురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. వీరిలో ఇద్దరిని కోయంబత్తూరు వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. టీచర్లు, సిబ్బంది మరణించడంతో కేరళలోని పాంగ్-పల్లిపరంబ ప్రభుత్వ స్కూల్లో విషాదం నెలకొన్నది.
Also Read:
Car, Bus Catches Fire | ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కారు.. చెలరేగిన మంటలు, 9 మంది మృతి
Watch: థార్‌తో ఐదుగురిని ఢీకొట్టిన ఎమ్మెల్యే కొడుకు.. హారన్ మోగిస్తున్నా ఎందుకు తప్పుకోలేదంటూ వాదన
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- die
- Flips
- Kerala
- Tamil Nadu
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

