Woman Poisons Neighbours Prasad | కూతురు పారిపోవడంపై మహిళ ప్రతీకారం.. పొరుగు వారి ప్రసాదంలో నిద్రమాత్రలు
Woman Poisons Neighbours Prasad | తన కూతురు ఇంటి నుంచి పారిపోయేందుకు సహకరించిన పొరుగింటి కుటుంబంపై ఒక మహిళ ప్రతీకారం తీర్చుకున్నది. ప్రసాదంలో నిద్రమాత్రలు కలిపింది. అది తిన్న ఆ కుటుంబంలోని ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారు. పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.
అహ్మదాబాద్: తన కూతురు ఇంటి నుంచి పారిపోయేందుకు సహకరించిన పొరుగింటి కుటుంబంపై ఒక మహిళ ప్రతీకారం తీర్చుకున్నది. ప్రసాదంలో నిద్రమాత్రలు కలిపింది. అది తిన్న ఆ కుటుంబంలోని ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారు. పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. (Woman Poisons Neighbours Prasad) గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. విలాసవంతమైన హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్న గోవర్ధన్‌భాయ్, ఏప్రిల్ 10న మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. డోర్ వద్ద ఉన్న లడ్డూ ప్రసాదాన్ని గమనించి లోపలకు తీసుకెళ్లాడు. గోవర్ధన్‌భాయ్, అతడి కోడలు కిరణ్ కలిసి చెరో లడ్డూ తిన్నారు.
కాగా, కొన్ని నిమిషాల్లోనే వారిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. గోవర్ధన్‌భాయ్ ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణించింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కోడలు కిరణ్ తీవ్రమైన నీరసం, అయోమయానికి గురైంది. చికిత్స తర్వాత వారిద్దరూ కోలుకున్నారు.
మరోవైపు ఏదో తేడా జరిగినట్లు గోవర్ధన్‌భాయ్ కుమార్తె ఇషా అనుమానించింది. దీంతో ప్రసాదం కవర్లోని మిగిలిన లడ్డూలను విడదీసి చూసింది. ప్రతి లడ్డూలో మూడు నాలుగు మాత్రలు ఉండటాన్ని ఆమె గమనించింది. తన తండ్రికి ఈ విషయం చెప్పింది. దీంతో పోలీసులకు వారు ఫిర్యాదు చేయగా అవి నిద్ర మాత్రలని నిర్ధారణ అయ్యింది.
కాగా, పొరుగున నివసించే ఉషాబెన్ ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఎనిమిది నెలల కిందట ఆమె కుమార్తె ఇంటి నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నది. గోవర్ధన్‌భాయ్ కుటుంబం, ముఖ్యంగా ఆయన కోడలు కిరణ్ దీనికి సహకరించినట్లు ఉషాబెన్ అనుమానింది. ఈ నేపథ్యంలో ఆ పొరుగింటి కుటుంబంపై ఆమె కక్ష పెంచుకున్నది. వారి దైవ భక్తిని తన ప్రతీకారానికి వినియోగించుకున్నది. లడ్డూ ప్రసాదంలో నిద్రమాత్రలు కలిపింది. దర్యాప్తులో ఇది తెలుసుకున్న పోలీసులు ఉషాబెన్ను అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ సంఘటనతో గోవర్ధన్‌భాయ్ కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురైంది. మరో లడ్డూ తిని ఉంటే తాము మరణించి ఉండేవారని ఆందోళన చెందింది. పొరుగింటి కుటుంబంతో తమకు ప్రాణహాని ఉండటంతో వారిని ఖాళీ చేయించాలని హౌసింగ్ సొసైటీ. స్థానిక అధికారులను కోరారు. లేని పక్షంలో తామే తమ ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Also read:
Car, Bus Catches Fire | ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కారు.. చెలరేగిన మంటలు, 9 మంది మృతి
Riddle of 16 | లోక్‌సభలో ‘16’ సంఖ్యను ప్రస్తావించిన రాహుల్ గాంధీ.. దాని చిక్కుముడి ఏమిటంటే?
Watch: థార్‌తో ఐదుగురిని ఢీకొట్టిన ఎమ్మెల్యే కొడుకు.. హారన్ మోగిస్తున్నా ఎందుకు తప్పుకోలేదంటూ వాదన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

