BJP’s Women’s March | రాహుల్ గాంధీ నివాసం వద్ద బీజేపీ మహిళల నిరసన
BJP's Women's March | లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మహిళా ఎంపీలు, నాయకురాళ్లు, ఆ పార్టీ మహిళా కార్యకర్తలు శనివారం ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
న్యూఢిల్లీ: లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మహిళా ఎంపీలు, నాయకురాళ్లు, ఆ పార్టీ మహిళా కార్యకర్తలు శనివారం ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. (BJP’s Women’s March) నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మహిళా ఎంపీలు హేమ మాలిని, కమల్జీత్ సెహ్రావత్, బన్సూరి స్వరాజ్, మంజు శర్మ, వాత్సల్య గుప్తా నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.
కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, ఎంపీ మనోజ్ తివారీ, పార్టీ మహిళా కార్యకర్తలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
మరోవైపు బీజేపీ మహిళా ఎంపీలు, మహిళా నేతలు, కార్యకర్తల నిరసనను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుకు నీటిని వెదజల్లారు. కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే, బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన ప్రాంతం నుంచి వారిని తరలించారు.
అయితే, నిరసన జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ తన నివాసంలో లేరు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఎన్నికల ప్రచార సభకు ఆయన హాజరయ్యారు.
#WATCH | Delhi: Police deploy water cannons to disperse women workers of the BJP, who are protesting near the residence of Lok Sabha LoP Rahul Gandhi, a day after the Constitution (131st Amendment) Bill failed to pass in the Lok Sabha. pic.twitter.com/HeAoiH4XTN
— ANI (@ANI) April 18, 2026
#WATCH | Delhi: Union MoS Raksha Khadse and BJP MP Bansuri Swaraj detained by Police personnel during protest march to the residence of Lok Sabha LoP Rahul Gandhi, a day after the Constitution (131st Amendment) Bill failed to pass in the Lok Sabha. pic.twitter.com/OVdpBcXR8W
— ANI (@ANI) April 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

