బెంగళూరు: కర్ణాటకలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ కేసు (Bird Flu Case) నమోదైంది. బెంగళూరు శివారు ప్రాంతమైన హెసరఘట్ట సమీపంలో ముథూర్ గ్రామంలోని ఒక కోళ్ల ఫారమ్‌లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్5ఎన్1) వైరస్‌ను గుర్తించారు. ఏప్రిల్ 14న ఆ ఫారమ్‌లోని కోళ్లకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల సమయంలో బర్డ్ ఫ్లూ కేసు నిర్ధారణ అయ్యింది.
కాగా, పశుసంవర్ధక, ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించారు. వైరస్ వ్యాప్తి నివారణకు తక్షణ చర్యలు చేపట్టారు. ఏప్రిల్ 15న ఆ ఫారమ్‌లో ఉన్న మొత్తం 7,444 కోళ్లను చంపి పెద్ద గోయ్యి తీసి పూడ్చిపెట్టారు. 14,788 గుడ్లు, 2,250 కిలోల పౌల్ట్రీ ఫీడ్‌ను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించారు. 10 మంది పౌల్ట్రీ కార్మికులను క్వారంటైన్లో ఉంచారు.
మరోవైపు ఆ ప్రాంతాన్ని ‘ఇన్ఫెక్టెడ్ జోన్’గా అధికారులు ప్రకటించారు. సమీప ప్రాంతాల్లోనూ నిఘాను ముమ్మరం చేశారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read:
Valparai Tragedy | కొండ మలుపు నుంచి కిందకు దూసుకెళ్లిన వాహనం.. ఏడుగురు టీచర్స్‌తో సహా 9 మంది మృతి
Ashok Kharat | అశోక్ ఖరత్ సన్నిహితుడు, అతడి భార్య.. రోడ్డు ప్రమాదంలో మృతి
Watch: ఒక్క రోజు వయసున్న ఖడ్గమృగం పిల్ల.. అరుదైన వీడియో వైరల్