అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్) : హాకీ ప్రపంచకప్లో టైటిల్ వేటను భారత మహిళల జట్టు డ్రాతో ఆరంభించింది. పూల్-డీలో భాగంగా ఆదివారం ఇక్కడ ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో భారత్.. చైనాతో పోరును 2-2తో డ్రాగా ముగించింది. మూడో క్వార్టర్ దాకా మ్యాచ్లో ఆధిక్యం సాధించి గెలుపు దిశగా సాగిన మన అమ్మాయిలు.. ఆ తర్వాత ప్రత్యర్థికి గోల్ సమర్పించుకుని డ్రాతో సంతృప్తిపడాల్సి వచ్చింది.
భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (8వ నిమిషంలో), దీపికా (26వ) గోల్స్ చేయగా చైనా నుంచి ఝాంగ్ యింగ్ (14వ), మా నింగ్ (39వ) గోల్స్ సాధించారు. తర్వాతి మ్యాచ్లో భారత్ ఈనెల 18న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. కాగా పురుషుల విభాగంలో భారత్.. తమ రెండో మ్యాచ్లో సోమవారం ఇంగ్లండ్తో ఆడనుంది.