Amarinder Singh | అమరిందర్ సింగ్ బీజేపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారా.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్
Amarinder Singh : బీజేపీ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ అంశంపై కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు.
Amarinder Singh : బీజేపీ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే పదవులు పొంది, అనంతరం బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో అమరిందర్ సింగ్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ అంశంపై కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. బీజేపీ తన అభిప్రాయలకు విలువ ఇవ్వడం లేదని, అంతమాత్రాన ఆ పార్టీని వ్యతిరేకిస్తూ బీజేపీని వీడబోతున్నాననే ప్రచారంలో నిజం లేదన్నారు.
శుక్రవారం అమరిందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక పార్టీ (బీజేపీ) తన అభిప్రాయాల్ని అడగడం లేదన్నారు. నేను 60 ఏళ్లుగా పంజాబ్ రాజకీయాల్లో ఉన్నాను. నేను ఒంటరిని కాదు. నాతోపాటు ఎందరో సహచరులున్నారు. కొన్నేళ్లుగా పంజాబ్ రాజకీయాల్ని దగ్గర నుంచి చూస్తున్నాం. కానీ, ఒక దశలో వారు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మమ్మల్ని ఏమీ అడగడం లేదు. మేం ఇక్కడికి చెందిన వాళ్లం. పంజాబ్‌కు సంబంధించి మా అభిప్రాయాల్ని, సలహాల్ని చెప్పడం మా బాధ్యత. కొంతమంది పార్టీలోకి వచ్చి ఏడాది కూడా ఉండటం లేదు. నేను కాంగ్రెస్‌లో, బీజేపీలో ప్రాధాన్యం లేని వ్యక్తిని కాను.
అయినంత మాత్రాన నేను బీజేపీని వీడి వేరే పార్టీలో చేరుతున్నట్లు కూడా కాదు అని కెప్టెన్ అమరిందర్ వ్యాఖ్యానించారు. అంటే, ఇప్పటికిప్పుడు తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్నప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో తనను బీజేపీ కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో ఇటీవల అంతగా ప్రాధాన్యత దక్కకపోవడంతో కెప్టెన్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

