ప్రజా దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి : కలెక్టర్ దివాకర టీఎస్
ప్రజలకు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. శనివారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఎర్రుపాలెం మండల తాసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
– మొలుగుమాడు రీసర్వే డేటా పరిశీలన
– మొదటి విడతలో ఐదు గ్రామాల్లో భూ రీసర్వే పారదర్శకంగా చేపట్టాలి
ఎర్రుపాలెం, సెప్టెంబరు 26 : ప్రజలకు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. శనివారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఎర్రుపాలెం మండల తాసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ దరఖాస్తుల వివరాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మొలుగుమాడు గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహించిన భూ రీసర్వే వివరాలు, డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. రీసర్వే అనంతరం రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఎర్రుపాలెం మండలంలో మొదటి విడతగా ఐదు గ్రామాల్లో చేపడుతున్న భూ రీసర్వేకు సంబంధించిన పంచనామా పత్రాలు, కంప్యూటర్ డేటా ఎంట్రీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి రీసర్వే ఉద్దేశ్యం, చేపడుతున్న ప్రక్రియపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సందేహాలను తెలుసుకుని నివృత్తి చేయాలని సూచించారు. సర్వేలో ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రతి అంశాన్ని రైతుల సమక్షంలోనే పరిశీలించి నమోదు చేయాలని స్పష్టం చేశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను బీఎల్ఓలు యాప్‌లో నమోదు చేసే విధానం, హియరింగ్‌కు హాజరైన ఓటర్ల సమస్యల పరిష్కారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న వివిధ దస్త్రాలు, స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్లు, సాదాబైనామా, భూభారతి దరఖాస్తుల స్థితిగతులను కలెక్టర్ సమీక్షించారు. ప్రజలకు సంబంధించిన భూ సమస్యలను ఎక్కువకాలం పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌కార్డులు తదితర సేవల దరఖాస్తుల పరిష్కారంపై వివరాలు తెలుసుకున్నారు. సేవల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సాధ్యమైనంత వరకు మండల స్థాయిలోనే పరిష్కరించాలని, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల కార్యాలయాలకు వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులో పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తగ్గించాలని ఆదేశించారు. మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు స్థానిక నాయకులతో కలిసి కలెక్టర్‌ను కలిశారు. మండలంలోని పలు గ్రామాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, తాసీల్దార్ సునీత ఎలిజబెత్, డిప్యూటీ తాసీల్దార్ జ్యోతి, ఆర్ఐలు రవికుమార్, శిరీష, సర్వేయర్ రాజశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

