దుమ్ముగూడెం, సెప్టెంబర్ 26 : ఏజెన్సీ మండలమైన దుమ్ముగూడెంలో తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలకు వరినాట్లు పూర్తిగా నీట మునిగాయి. మండల పరిధిలోని కాశీనగరం, కేశవపట్నం, ప్రగళ్లపల్లి, పెద్దనల్లబల్లి తదితర గ్రామాల్లో సుమారు 100 ఎకరాల్లో ఈ తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో రైతులు సాగుచేసిన వరిచేలు నీట మునిగాయి. మూడు రోజుల పాటు వరదనీరు చేలల్లో ఉండిపోవడంతో వరినారు బతికే పరిస్థితి లేదని, 50 శాతం పైగా పంట వచ్చే అవకాశం ఉండదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. గత మూడు నెలలుగా ఎల్న్ని ప్రభావం కారణంగా వరినాట్లు ఆలస్యంగా పడినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు సాగుచేయగా సగానికి పైగా వరినారు దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తుఫాన్‌కు నీట మునిగిన వరినాట్లు -ఆందోళనలో అన్నదాతలు
కాశీనగరంలో గోనె ఉపేంద్రకు రెండు ఎకరాలు, రేఖం నరేశ్‌కు రెండు ఎకరాలు, వల్లెపు జంపన్న ఎకరం, కేశవపట్నంలో గోనె ఉపేంద్ర, గోనె సమ్మయ్యకు ఆరెకరాలతో పాటు ఇతర రైతులకు సంబంధించి పదుల సంఖ్యలో వరినాట్లు వేసి ఒక దఫా మందులు సైతం చల్లించి ఉన్నారని… ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి అయిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ తుఫాన్ కారణంగా వరిచేలు నీట మునిగినా నేటి వరకు వ్యవసాయ అధికారులు కానీ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండల రైతులు గగ్గోలు పెడుతున్నారు.
ప్రభుత్వమే మాలాంటి రైతులను ఆదుకోవాలి. కౌలుకు పొలం తీసుకుని ఆరెకరాల్లో వరినార్లు వేసి ఒక దఫా మందులు చల్లించాను. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు వచ్చిన తుఫాను కారణంగా వరినాటు నీట మునిగి సగానికి పైగా చనిపోయింది. ప్రభుత్వం వ్యవసాయ అధికారులతో పంటను అంచనా వేసి పరిహారం అందేలా చూడాలి.

తుఫాన్‌కు నీట మునిగిన వరినాట్లు -ఆందోళనలో అన్నదాతలు