Birth rates | జననాల రేటు తగ్గడానికి స్మార్ట్ ఫోన్లూ కారణమే.. పలు అధ్యయనాల్లో వెల్లడి..!
Birth rates | ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల తీరు మందగించింది. మూడు దశాబ్దాల క్రితం భారత్ (India) లో ఒక మహిళ సగటున 3.4 మంది పిల్లలకు జన్మనిచ్చేది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 2.0 కి పడిపోయింది. ఇది జనాభా స్థిరంగా ఉండటానికి అవసరమైన 2.1 కంటే తక్కువ. అయితే ఈ ధోరణి కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో జననాల రేటు (Birth rate) తీవ్రంగా పడిపోతున్నది.
Birth rates : ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల తీరు మందగించింది. మూడు దశాబ్దాల క్రితం భారత్ (India) లో ఒక మహిళ సగటున 3.4 మంది పిల్లలకు జన్మనిచ్చేది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 2.0 కి పడిపోయింది. ఇది జనాభా స్థిరంగా ఉండటానికి అవసరమైన 2.1 కంటే తక్కువ. అయితే ఈ ధోరణి కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో జననాల రేటు (Birth rate) తీవ్రంగా పడిపోతున్నది. కొన్ని దేశాల్లో అయితే మహిళలు సగటున ఒక్క బిడ్డకు కూడా జన్మనివ్వడం లేదు.
పెరుగుతున్న జీవన వ్యయం, ఖరీదైన గృహ వసతి, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, కెరీర్‌పై ఒత్తిడి, మారుతున్న సామాజిక పోకడలు లాంటివే సంతానలేమికి కారణాలని ఇప్పటివరకు అంతా భావించారు. కానీ ఇటీవలి కాలంలో పరిశోధకులు మరో కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చారు. అదే స్మార్ట్ఫోన్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావం..! స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లు మొదలైన టెక్నాలజీ మానవ సంబంధాలను మార్చిపారేస్తున్నది. ఈ మార్పే పిల్లల్ని కనే వారి సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నదని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
సిన్సినాటి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నాథన్ హడ్సన్, హెర్నాన్ మోస్కోసో-బోడో ఇటీవల అమెరికా, బ్రిటన్లలో 4జీ మొబైల్ ఇంటర్నెట్ రాకకు, జననాల రేటుకు మధ్య ఉన్న సంబంధంపై అధ్యయనం చేశారు. హై-స్పీడ్ మొబైల్ కనెక్టివిటీ ముందుగా వచ్చిన ప్రాంతాల్లో జననాల రేటు వేగంగా తగ్గినట్టు వారి పరిశోధనలో తేలింది. స్మార్ట్ఫోన్లు యువత ఒకరితో ఒకరు గడిపే విధానాన్ని ప్రాథమికంగా మార్చేశాయని, ముఖాముఖిగా కలుసుకోవడం తగ్గి, ఆన్లైన్లో ఎక్కువ సమయం గడపడంవల్ల సంతానోత్పత్తిపై ప్రభావం పడి ఉండవచ్చని వారు విశ్లేషించారు.
ఫైనాన్షియల్ టైమ్స్ విశ్లేషణ ప్రకారం కూడా అనేక దేశాల్లో స్మార్ట్ఫోన్ల వాడకం విస్తృతమైన తర్వాతే జననాలరేటు గణనీయంగా క్షీణించడం ప్రారంభమైంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో 2007 తర్వాత ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. స్మార్ట్ఫోన్లను ఎక్కువగా వినియోగించే యువతలో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉంది. ఫిన్లాండ్కు చెందిన జనాభా నిపుణురాలు అన్నా రోట్కిర్చ్ ప్రకారం.. యువతలో సోషల్ మీడియా వాడకం పెరగడంవల్ల జంటల మధ్య లైంగిక సమస్యలు కూడా పెరుగుతున్నాయని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో కనిపించే ఆడంబరమైన జీవనశైలి, ఆర్థికపరమైన ఆందోళనలు, ఇతరులతో పోల్చుకోవడం వంటివి యువతలో అభద్రతా భావాన్ని, అస్థిరతను పెంచుతున్నాయని, దీనివల్ల వారు పిల్లల్ని కనేందుకు సిద్ధపడటం లేదని ఆమె వాదిస్తున్నారు. గతంలో టీవీ సీరియళ్లలో చిన్న కుటుంబాలను చూసి మహిళలు తక్కువ మంది పిల్లల్ని కన్నట్టు కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఇప్పుడు టీవీ కంటే ఎన్నో రెట్లు ప్రభావవంతమైన స్మార్ట్ఫోన్లు ఈ మార్పును మరింత వేగవంతం చేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

