పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అంటే రికార్డులకు టైం అవుతుందని..! అజ్ఞాతవాసి ఎంత పెద్ద డిజాస్టర్ అయినా కూడా ఇప్పటికీ హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఆ సినిమా పేరు మీదే ఉన్నాయి. తొలి రోజు ఏకంగా రూ.41 కోట్ల షేర్ వసూలు చేసింది అజ్ఞాతవాసి. బాహుబలి సినిమాను పక్కన పెడితే ఇప్పటికీ అజ్ఞాతవాసి వసూళ్లు దాటిన సినిమా మరొకటి రాలేదు. అలాంటి రికార్డులు పవన్ కళ్యాణ్ సొంతం. ఇప్పుడు ఈయన మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్ సినిమాతో వస్తున్నాడు. ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే సినిమా ఎన్ని సంచలనాలకు తెర తీస్తుందో అనేది అర్థం అయిపోతుంది.
విడుదలైన క్షణం నుంచి వకీల్ సాబ్ ట్రైలర్ కొత్త చరిత్ర తిరగ రాస్తూనే ఉంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లైక్స్ సాధించిన ట్రైలర్‌గా వకీల్ సాబ్ కొత్త చరిత్రకు తెర తీసింది. ఒకటి రెండు కాదు ఏకంగా 10 లక్షల లైక్స్ సంపాదించింది ఈ సినిమా ట్రైలర్. ఇప్పటి వరకు వన్ మిలియన్ లైక్స్ సాధించిన ట్రైలర్ ఒకటి కూడా తెలుగు ఇండస్ట్రీలో లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఆ రికార్డులు తిరగరాశాడు. ఇప్పటికీ ఆ రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయి. 23 గంటల 39 నిమిషాల వ్యవధిలో 10 లక్షల లైకులు సాధించిందీ సినిమా. ట్రైలర్ ఇప్పటికే బాహుబలి 2 సినిమా రికార్డులను కూడా ఈ ట్రైలర్ క్రాస్ చేసింది. పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉంటే రేపు సినిమా విడుదలైన తర్వాత ఎలా ఉంటాయో మరి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి