అనుష్క-నవీన్ పొలిశెట్టి కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రారా కృష్ణయ్య ఫేం మహేశ్ దర్శకత్వం వహించనున్నాడు. 20 ఏండ్ల యువకుడు అతని కంటే 10 ఏండ్లు పెద్ద వయస్సున్న మహిళ మధ్య సాగే ప్రేమలో నేపథ్యంలో మూవీ తెరకెక్కనుంది. అయితే అనుష్క ఈ సినిమా కోసం స్లిమ్ గా మారే పని మాత్రం పెట్టుకోనని మేకర్స్ కు చెప్పినట్టు టాక్ నడుస్తోంది.
బరువు సంబంధిత కారణాల వల్ల అనుష్క కొత్త సినిమాల విషయంలో వెనక్కి తగ్గినట్టు వార్తలు వచ్చాయి. ఈ సారి యువ నటుడు నవీన్ పొలిశెట్టి పక్కన కనిపించాల్సి రావడంతో మళ్లీ తాను సినిమాల కోసం స్లిమ్ గా మారేందుకు రిస్క్ తీసుకోవద్దని స్వీటీ ఫిక్సయినట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అనుష్క ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో నవీన్ పొలిశెట్టిని హీరోగా తీసుకోవాలని ప్రొడక్షన్ హౌజ్‌కు ప్రభాస్ స్వయంగా చెప్పాడని టాక్ వినిపిస్తోంది.