రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ్
వకీల్ సాబ్ | పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ దూకుడు చూస్తుంటే అమ్మో అనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ దూకుడు చూస్తుంటే అమ్మో అనిపిస్తుంది. సాధారణంగానే పవన్ సినిమాలు అంటే భారీ అంచనాలుంటాయి. అందులోనూ మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్. వీళ్లు సినిమా కోసం ఎంతగా వేచి చూస్తున్నారు అనేది ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న తీరు.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఇవన్నీ చూసిన తర్వాత నిర్మాతలకు, బయ్యార్లకు తెలియని భయం మొదలైంది. పైకి లేదని చెప్పినా కూడా లోపల మాత్రం ఇంత భారీ అంచనాలు చూసి.. ఏదైనా తేడా కొడితే ఎలా అనే కంగారు వాళ్లలో కనిపిస్తుంది. ఎందుకంటే వకీల్ సాబ్ సినిమాకు జరిగిన బిజినెస్ అలా ఉంది మరి.

పాజిటివ్ టాక్ వస్తే వకీల్ సాబ్ దూకుడు అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఏదేమైనప్పటికీ మొదటి వారంలోనే భారీగా కలెక్షన్లు రాబట్టాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం సినిమాను రికార్డు స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 9న తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్లో చూసినా కూడా పవన్ బొమ్మే కనిపించేలా విడుదల ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. దాదాపు 95 శాతం థియేటర్స్‌లో వకీల్ సాబ్ మాత్రమే కనిపించబోతున్నాడు. ఓవర్సీస్లోనూ రప్ఫాడిస్తున్నాడు వకీల్ సాబ్.

ప్యాండమిక్ తర్వాత ఇంత భారీగా విడుదల కాబోతున్న ఇండియన్ సినిమా ఇదే. కరోనా తర్వాత ఓవర్సీస్లో మన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఇలాంటి సమయంలో వచ్చిన జాతి రత్నాలు సినిమా తొలిసారి 1 మిలియన్ మార్క్ అందుకుని నమ్మకం పెంచేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో తెలుగు సినిమాకు ఓవర్సీస్లో మునపటి కళను తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే ఓవర్సీస్లోనే 700 స్క్రీన్లలో వకీల్ సాబ్ సినిమాను విడుదల చేయబోతున్నట్లు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించాడు.
ఇది విన్న తర్వాత కొందరికి షాకింగ్ అనిపించొచ్చు కానీ కచ్చితంగా పవన్ రేంజ్‌కు ఇది సరిపోయే స్క్రీన్స్ అంటున్నారు అభిమానులు. ఒకవేళ టాక్ బాగా వచ్చిందంటే ప్రీమియర్స్ రూపంలోనే మిలియన్ రావడం ఖాయం. అదే వాళ్ల టార్గెట్ కూడా. ఏదేమైనా కూడా ఏప్రిల్ 9న దాదాపు 2500 థియేటర్స్‌లో వకీల్ సాబ్ విడుదలకు సిద్ధమవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
శూలంతో పవన్‌కల్యాణ్ కసరత్తులు..ఫొటోలు హల్చల్
పీపుల్ మీడియాతో పవన్‌కల్యాణ్ భాగస్వామ్యం
కోవిడ్ టీకా తీసుకున్న మలైకా అరోరా
నాగార్జున కోసం చిరు వంట..ట్రెండింగ్‌లో స్టిల్
మెగా మేనల్లుడి మూడో చిత్రం షురూ..
అలియాభట్‌కు కరోనా పాజిటివ్
వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ గురించి అంజలి ఏమన్నదంటే..
వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు
సల్మాన్ ఖాన్ ‘రాధే’ కు నో సెన్సార్ కట్స్
ఆ వార్త నిజం కాదు..విజయ్ సినిమాపై బాలీవుడ్ హీరో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

