మార్చి 31న జరిగిన పూజా సెర్మనీతో లాంఛనంగా ప్రారంభమైంది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 65వ ప్రాజెక్టు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ విలన్ గా నటించబోతున్నట్టు వార్తలు కోలీవుడ్ నాట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పుకార్లను కొట్టిపారేశాడు. కోలీవుడ్ అప్ డేట్స్ ట్వీట్‌పై విద్యుత్ జమ్వాల్ స్పందిస్తూ..నేను ఎదురుచూస్తున్నా. కానీ ఈ వార్త నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు. అయితే విజయ్‌తో తాను సినిమా చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అజిత్ నటించిన బిల్లా 2 చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు విద్యుత్ జమ్వాల్. అంతేకాదు విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన తుపాకి సినిమాలో విలన్ గా అందరినీ మెప్పించాడు. కోలమావు కోకిల, డాక్టర్ సినిమాల తర్వాత విజయ్ సినిమాతో మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్.