e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News అలియాభట్‌కు కరోనా పాజిటివ్‌

అలియాభట్‌కు కరోనా పాజిటివ్‌

అలియాభట్‌కు కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియాభట్‌ కరోనా మహమ్మారి బారినపడింది. వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేసినట్లు గురువారం అర్ధరాత్రి ఇస్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ఇంట్లో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నానని, వైద్యుల సలహా మేరకు అన్ని భద్రతా ప్రోటోకాల్స్‌ పాటిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అలియా సంజయ్‌ లీలా భన్సాలీ గంగుభాయ్‌ కతియావాడి చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

అలియాభట్‌కు కరోనా పాజిటివ్‌

గత నెల మొదట్లో చిత్ర డైరెక్టర్‌ భన్సాలీ కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. కొద్ది రోజుల్లో వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ముంబైలోని స్టూడియోలో గంగూభాయ్ కతియావాడి చిత్రానికి సంబంధించిన పాటను షూట్ చేస్తున్నారు. ఈ షూట్‌లోనే అలియాభట్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్య పరీక్షలు చేయించగా.. ఆమెకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. అలియా బాయ్‌ఫ్రెండ్‌ రణబీర్‌ కపూర్‌ సైతం మార్చిలో కరోనా సోకింది. అప్పుడు సైతం అలియా కొద్ది రోజులు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంది.

అలియాభట్‌కు కరోనా పాజిటివ్‌

ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌గా పరీక్షించినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. ఇటీవల బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రముఖులు మహమ్మారి బారినపడ్డారు. మిలింద్‌, ఆర్‌ మాధవన్‌, అమీర్‌ఖాన్‌, రణబీర్‌ కపూర్‌, కరిక్‌ ఆర్యన్‌, రోహిత్‌ సరఫ్‌, సిద్ధాంత్‌ చతుర్వేది, మనోజ్ బాజ్‌పేయి, రణ్‌వీర్‌ షోరే, మ్యూజిక్‌ డైరెక్టర్‌ బప్పిలహరి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. ప్రస్తుతం అలియాభట్‌ అయాన్‌ ముఖర్జీ చిత్రం బహ్మాస్త్రంలో రణబీర్‌ కపూర్‌కు జోడీగా నటిస్తోంది. అలాగే తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి..

మట్టివాసన ఉన్న సినిమా ఇది!
నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కులేదు!
వంశీ పైడిపల్లిని అన్నా అని పిలిచిన స్టార్ హీరోయిన్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అలియాభట్‌కు కరోనా పాజిటివ్‌

ట్రెండింగ్‌

Advertisement