మట్టివాసన ఉన్న సినిమా ఇది!

‘ఎడిట్ రూమ్ నుంచి బయటకు రాగానే దర్శకుడు శివ నిర్వాణతో ‘ఫిక్సయిపో..సినిమా బ్లాక్‌బస్టర్ హిట్’ అని చెప్పాను. నా కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రమిది’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టక్ జగదీష్’. షైన్‌స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది నిర్మించారు. ఈ నెల 23న విడుదలకానుంది. గురువారం ట్రైలర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నాని మాట్లాడుతూ ‘అచ్చమైన తెలుగు సినిమా ఇది. మన మట్టివాసన కలిగిన ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఆసాంతం భావోద్వేగభరితమైన కుటుంబ చిత్రంగా హృదయాల్ని స్పృశిస్తుంది. అందుకే ఈ ఏప్రిల్ మాసానికి ‘మంత్ ఆఫ్ జగదీష్’ అనే హ్యాష్‌టాగ్ పెట్టాం’ అన్నారు. ‘ప్రతి ఒక్కరి కుటుంబాల్లోని అనుబంధాల్ని ఈ సినిమాలో ఆవిష్కరించాను. కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోయే చిత్రమవుతుంది. తెలుగు రాష్ర్టాల్లోని ప్రతి ఒక్క కుటుంబం తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’ అని దర్శకుడు తెలిపారు. ‘ట్రైలర్‌ను ఈ నెల 13న వైజాగ్‌లో విడుదల చేస్తున్నాం. 18న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహిస్తాం’ అని నిర్మాత సాహు గారపాటి పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Nani
- Tollywood
- Tuck Jagadish
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

