Viral Video | రిటైర్మెంట్ తర్వాత జీవితం అంటే ఇదే..!
Viral Video : కుటుంబంతో కలిసి సుదూర ప్రయాణాలంటే ఇష్టపడని వారుండరు. ఇక రిటైర్మెంట్ తర్వాత ప్రపంచాన్ని చుట్టేయాలని చాలా మంది కోరుకుంటారు.
Viral Video : కుటుంబంతో కలిసి సుదూర ప్రయాణాలంటే ఇష్టపడని వారుండరు. రిటైర్మెంట్ తర్వాత ప్రపంచాన్ని చుట్టేయాలని చాలా మంది కోరుకుంటారు. పదవీవిరమణ పొంది పిల్లల బాధ్యతలు తీర్చిన తర్వాత తమదైన జీవితాన్ని ఆస్వాదించాలని అనుకోని వారుండరు. ఇక ఈ తరహాలో ఓ జంట టూర్‌కు వెళ్లి తమ వ్యాన్లోనే భోజనం తయారుచేసుకుని లంచ్ ముగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
జీవితానుభవాన్ని చవిచూసిన ఈ దంపతులు రిటైర్డ్ పంజాబీ అనే తమ ఇన్స్టాగ్రాం పేజ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. కారులోనే ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి కిచెన్‌లో వీరు వంట చేసుకుని ఇష్టంగా ఆరగించడం ఈ క్లిప్‌లో చూడొచ్చు. తాము రిటైరైన జంటని, తమ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించామని పోస్ట్‌లో రాసుకొచ్చారు. తాము ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకూ 52 రోజుల ట్రిప్‌లో ఉన్నామని తెలిపారు. రోడ్ ట్రిప్‌లో భాగంగా వారు లంచ్ ప్రిపేర్ చేసేందుకు ఔరంగాబాద్ హైవే పక్కన కొద్దిసేపు ఆగారు.
ఈ వీడియోలో భార్య కూరగాయలను సిద్ధం చేసి వంట చేసేందుకు సన్నద్ధమవుతుండగా, భర్త సహకరించడం చూడొచ్చు. ఆపై ఇద్దరూ ఫోల్డబుల్ టేబుల్, ఛైర్స్‌లో సేదతీరుతూ ఆలూ గ్రేవీ డిష్‌ను ఎంజాయ్ చేస్తూ లంచ్ చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోపై పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. క్యా బాత్ హై అని స్టాండప్ కమెడియన్ రవి గుప్తా కామెంట్ చేయగా, రిటైర్మెంట్ అనే పదానికి ఇదే నిజమైన మీనింగ్ అని మరో యూజర్ రాసుకొచ్చారు. చివరికి ఏదో ఒక దశలో తల్లితండ్రులు తమ జీవితాలను ఆస్వాదిస్తూ మరపురాని అనుభవాలను సొంతం చేసుకుంటారని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Dimple Yadav | కన్నౌజ్‌లో అఖిలేష్ ఎంట్రీతో బీజేపీలో వణుకు : డింపుల్ యాదవ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

