Watch: రీల్ కోసం తలకిందులుగా యువకుడు స్టంట్.. తర్వాత ఏం జరిగిందంటే?
Reel Stunt | ఒక యువకుడు రీల్ కోసం తలకిందులుగా స్టంట్ చేశాడు. అయితే స్కూల్ స్లాబ్ కూలడంతో అతడు మరణించాడు. ఆ యువకుడి కష్టార్జితంపై ఆధారపడిన పేద కుటుంబం తల్లడిల్లిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: ఒక యువకుడు రీల్ కోసం తలకిందులుగా స్టంట్ చేశాడు. (Reel Stunt) అయితే స్కూల్ స్లాబ్ కూలడంతో అతడు మరణించాడు. ఆ యువకుడి కష్టార్జితంపై ఆధారపడిన పేద కుటుంబం తల్లడిల్లిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని బాంద్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల శివం ఇన్స్టాగ్రామ్లో రీల్ కోసం స్టంట్ చేశాడు. స్కూల్ టెర్రస్పై తలకిందులుగా వేలాడాడు. చేతుల్లో ఇటుకలు ఉంచుకుని ఎక్సర్సైజ్ చేశాడు.
కాగా, ఉన్నట్టుండి స్కూల్ స్లాబ్ ఊడిపోయింది. కింద పడిన శివంపై స్లాబ్ శిథిలాలు పడ్డాయి. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు ఆ స్కూల్ వద్దకు చేరుకున్నాడు. కుటుంబానికి ఆధారమైన శివం ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేకపోయారు. యువకుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు శివం స్నేహితులు రికార్డ్ చేసిన ఈ రీల్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ప్రమాదకార స్టంట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని యువతకు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dies
- hangs
- Reel
- Slab Falls
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

