(TANA & APNRTS) విజయవాడ: రెండు సంఘాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకుని ప్రవాస తెలుగు వారికి సహాయం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నిర్ణయించాయి. తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీఎస్ కార్యాలయాన్ని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా అంజయ్య చౌదరిని ఏపీఎన్ఆర్టీఎస్ ప్రతినిధులు ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అనంతరం రాష్ట్రంలో ఐటీ, ఐటీఈఎస్ రంగాలలో పెట్టుబడులపై అమెరికాలోని తెలుగు ప్రవాసులతో సహకరించే మార్గాలను అన్వేషించడం గురించి తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరితో వెంకట్ మేడపాటి చర్చించారు.
ప్రవాస తెలుగు వారు తమ సొంత పట్టణాలు, గ్రామాలకు తిరిగి కనెక్ట్ అయ్యేలా అభివృద్ధి ప్రక్రియలో పాల్గొనాలని లావు అంజయ్య చౌదరి సూచించారు. ఏపీఎన్ఆర్టీ ట్రస్ట్ ద్వారా సంస్కృతి, తెలుగు భాషపై విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఏపీ విద్యార్థులకు ప్రవాసాంధ్ర భరోసా బీమాను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు ప్రవాసుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజన్ చాలా బాగున్నదని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి కొనియాడారు. ప్రవాస తెలుగు ప్రజలు, వలస కార్మికుల కోసం తమ సంస్థ చేస్తున్న సేవలు, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు.
చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!
అమ్మో.. నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?
కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది వీళ్లే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..