(Swaroopanandendra Swamyji) గుంటూరు : కృష్ణా నదిలో మునిగిపోయి చనిపోయిన వేద విద్యార్థుల కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు విశాఖలోని శ్రీ శారదాపీఠం ముందుకొచ్చింది. మృతుల కుటుంబాలకు పరిహారం అందివ్వడంతోపాటు వేద పాఠశాల విద్యార్థలను తమ వద్ద చదివించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు శ్రీ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజి ఒక ప్రకటనలో తెలిపారు.
గుంటూరు జిల్లా మాడిపాడు ఘటనలో శ్వేత శృంగాచలం వేద వేదాంత గురుకులం విద్యార్థులు ఐదుగురు వేద విద్యార్థులు, వారి గురువు కృష్ణ నదిలో మునిగి దుర్మరణం చెందారు. ఈత రాకపోవడం వల్లనే వీరంతా నదీ ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. ఈ ఘటనపై విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వేద పాఠశాల చిన్నారుల మృతి తీవ్ర దిగ్భ్రాంతికరమని భావోద్వేగానికి లోనయ్యారు. మృతుల కుటుంబాలకు తమ వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఆ పాఠశాలలోని మిగతా విద్యార్థులను తమ పాఠశాలలో చదివించేందుకు సిద్ధమని తెలిపారు.
చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!
అమ్మో.. నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?
కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది వీళ్లే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..