(Mask and Fine) అమరావతి: ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ రాష్ట్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఒమిక్రాన్ వ్యాప్తిని నిరోధించడంలో కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేసేందుకు ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మార్గదర్శకాలు అమలయ్యేట్లు జిల్లా ఉన్నతాధికారులు చూడాలని ప్రభుత్వం సూచించింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తారు. వ్యాపార సంస్థలు మాస్కులు లేని వ్యక్తులను అనుమతిస్తే ఆ సంస్థల నుంచి రూ.10,000 నుంచి రూ.25,000 వరకు జరిమానా వసూలు చేస్తారు. అంతేకాకుండా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే రెండు రోజుల పాటు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు బుక్ చేయనున్నారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. వివాహాలు, మతపరమైన సమావేశాలు సామాజిక కార్యకలాపాలతో సహా అన్ని సమావేశాలను నిర్వహించుకోవడానికి 500 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో పాల్గొనే వారందరూ విధిగా మాస్క్ ధరించడం, తరచూ హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడంతోపాటు కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనిని అధికారులు పేర్కొన్నారు.
చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!
అమ్మో.. నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?
కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది వీళ్లే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..