(NIT-AP) తాడేపల్లిగూడెం : ఆంధ్రప్రదేశ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) పునరుత్పాదక ఇంధన రంగంలో కామన్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్ (సీఆర్టీడీహెచ్) ను ఏర్పాటు చేయనున్నది. ఈ హబ్ స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పరిశోధన, పరీక్ష సేవలను అందిస్తుందని నిట్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీఎస్పీ రావు తెలిపారు.
ఈ పరిశోధన, అభివృద్ధి కేంద్రం సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపజేయడానికి స్థానిక పరిశ్రమలు, సంస్థలతో కలిసి పనిచేయడానికి విద్యార్థులు, అధ్యాపకులను అనుమతిస్తుందని నిట్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ పీ శంకర్ చెప్పారు. ఈ హబ్ పునరుత్పాదక రంగానికి సంబంధించిన వివిధ కమ్యూనిటీ సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుందని వెల్లడించారు. ఇది శక్తి వనరుల కోసం ప్రత్యామ్నాయ వ్యవస్థలను నిర్మించడంలో పాల్గొనేందుకు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను సులభతరం చేస్తుందని తెలిపారు.
చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!
అమ్మో.. నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?
కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది వీళ్లే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..