న్యూఢిల్లీ : ఇటీవలి కాలంలో అత్యంత తక్కువ వర్షపాతంతో భారత నైరుతి రుతు పవన కాలం బుధవారంతో అధికారికంగా ముగిసింది. 2021 నుంచి గమనిస్తే 13 శాతం లోటు వర్షపాతంతో తక్కువ వర్షాలు నమోదైన నాలుగో సీజన్‌గా నిలిచింది. ఈసారి సాధారణ నైరుతి వర్షపాతంలో 87 శాతం మాత్రమే కురిసింది.
దేశ వ్యాప్తంగా 282 జిల్లాల్లో (38 శాతం) తక్కువ వర్షపాతం సంభవించింది. మరోవైపు చలి కాలంలోనూ ఎల్ నినో ప్రభావం వంద శాతం కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మార్చి 2027 వరకు దాని ప్రభావం ఉండొచ్చని తెలిపింది.