భువనేశ్వర్: ఒడిశాలో ట్రాఫిక్ జరిమానాల్లో అవకతవకలపై కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీట్ బెల్ట్ ధరించలేదని బైకర్లకు, హెల్మెట్ పెట్టుకోలేదని కార్ల చోదకులకు జరిమానాలు వేసిన ఉదంతాలను ఆడిట్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. 2019-2024 మధ్య కాలంలో వాహన్, ఈ-చలాన్ డాటాను విశ్లేషించిన కాగ్ ద్విచక్ర వాహనదారులుగా నమోదైన వారిపై సీట్ బెల్ట్ ధరించలేదని 2,988 కేసులు నమోదు చేసి రూ.29.88 లక్షల జరిమానా విధించినట్టు గుర్తించింది.
త్రిచక్ర లేదా నాలుగు చక్రాల వాహనదారులుగా నమోదు చేసుకొన్నవారిపై హెల్మెట్ ధరించలేదని 4,786 కేసులు నమోదు చేసి రూ.47.86 లక్షల జరిమానా విధించినట్టు గమనించింది.