న్యూఢిల్లీ : మీ మొబైల్లో ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ లేకుండానే లైవ్ టీవీ చానల్స్ వీక్షించే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు ప్రసార భారతి ‘డైరెక్ట్ టు మొబైల్’ (డీ2ఎం) టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నది. కమర్షియల్‌గా అమలుచేసేందుకు అక్టోబర్‌లో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీచేయనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఐఐటీ కాన్పూర్, తేజస్ నెట్వర్క్స్తో కలిసి ప్రసారభారతి ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నది. దేశవ్యాప్తంగా 19 నగరాల్లో డీ2ఎం టెక్నాలజీపై ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇంటర్నెట్, వైఫై, సిమ్‌కార్డ్ సాయం లేకుండానే ప్రజలకు లైవ్ టీవీ, ఇంటర్నెట్, కాల్స్ అందించే సరికొత్త టెక్నాలజీనే ఈ డీ2ఎం.