(Liver Transplant) విశాఖపట్నం: బతికున్న దాత నుంచి కాలేయ మార్పిడిని విశాఖ కేర్ దవాఖాన వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. కూతురు కాలేయాన్ని మరణశయ్యపై ఉన్న తండ్రికి అమర్చి ఆయనను బతికించారు. 14 గంటల పాటు ఆపరేషన్ కొనసాగించి తుదకు విజయం సాధించారు. తండ్రి, కూతురు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు మీడియా సమావేశం ఏర్పాటుచేసి తెలిపారు. మీడియా సమావేశంలో తండ్రీకూతురు కూడా పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.
విశాఖపట్నంకు చెందిన నీలకంటేశ్వర్‌రావు (52) గత ఏడాది కాలంగా పోర్టల్ హైపర్‌టెన్షన్‌తో ఏర్పడిన కాలేయ వైఫల్యంతో బాధపడుతున్నాడు. అతడు కామెర్లతోపాటు పొత్తికడుపులో ద్రవం పేరుకుపోవడంతో వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నాడు. గత కొంతకాలంగా కేర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. మూత్రపిండాలు చెడిపోయే స్థితికి రావడంతో కాలేయ మార్పిడి వీలైనంత త్వరగా చేయాలని వైద్యులు నిర్ణయించారు. అయితే, అవయవ దాతలు ఎవరూ లేకపోవడంతో.. సగం కాలేయం ఇచ్చేందుకు కూతురు ముందుకొచ్చింది. డాక్టర్ మహ్మద్ నయీమ్, డాక్టర్ రవిశంకర్ కింజరాపు, డాక్టర్ రాజ్‌కుమార్ వైద్యుల బృందం 14 గంటల పాటు శస్త్రచికిత్స కొనసాగించారు. ప్రస్తుతం నీలకంటేశ్వర్‌రావు కోలుకుంటున్నారు. కాలేయం దాత అయిన ఆయన కుమార్తె కూడా ఆరోగ్యంగానే ఉన్నది.
అవయవదానం వల్ల మరణించిన తర్వాత కూడా ఇతరులకు సాయం చేసే అవకాశం ఉన్నదని కేర దవాఖాన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విశ్వజీత్ చెప్పారు. ట్రాన్స్‌ప్లాంట్ చేసే రోగుల్లో ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున కొవిడ్ మహమ్మారి సమయంలో అవయవ దానం సంఖ్య తగ్గిపోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!
అమ్మో.. నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?
కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది వీళ్లే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..