నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ మైదానంలో నమస్తే తెలంగాణ (Namaste Telangana ) , తెలంగాణ టుడే ( Telangana Today) ఆధ్వర్యంలో ఆటో షో ( Auto Show ) అట్టహాసంగా ప్రారంభమైంది. రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ( Kiran Kumar ) ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఆటో షోలో మొత్తం 14 ఆటోమొబైల్ కంపెనీల స్టాళ్లు ఏర్పాటయ్యాయి. ద్విచక్ర వాహనాలు, అధునాతన ఫీచర్లతో కూడిన కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఆటో షోలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ధర్మరాజు, తదితరులు పాల్గొన్నారు.