(Ananthapur JNTU) అనంతపురం: జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల వజ్రోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి వజ్రోత్సవాలు ఘనంగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నైలో 1946 లో స్థాపించిన ఈ కళాశాలను రెండో ప్రపంచ యుద్ధం అనంతర పునర్నిర్మాణ కార్యక్రమం కింద అనంతపురంకు మార్చారు. ఈ నెల 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలు జరుగుతాయని ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ పీ సుజాత తెలిపారు. రాష్ట్రంలోని పురాతన ఇంజినీరింగ్ కళాశాలగా చెప్పుకునే ఈ కళాశాల నుంచి ఎందరో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు దేశ సేవలో నిమగ్రమయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఇస్రో, డీఆర్డీఓ, డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లలో ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలుగా పనిచేశారు.
ప్రస్తుత కళాశాల భవనాలు 1958 లో నిర్మించగా.. అప్పటి నుంచి అత్యుత్తమ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేయడానికి నిలయంగా ఉన్నది. 25 సంవత్సరాలుగా ఎస్వీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నది. 1972లో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూ) స్థాపనతో సాంకేతిక విద్యలో కొత్త శకానికి నాంది పలికింది. ఈ కాలేజీ పూర్వవిద్యార్థుల్లో ముఖ్యంగా ప్రస్తుత ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్వర్గీయ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇస్రో శాస్త్రవేత్త సతీష్‌రెడ్డి, పారిశ్రామికవేత్త రవీంద్రారెడ్డి వంటి వారున్నారు. 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ జర్నల్స్, రిఫరెన్స్ మాన్యువల్స్‌తో అద్భుతమైన లైబ్రరీ ఉన్నది. కళాశాల సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాలలో 4-సంవత్సరాల బిటెక్ రెగ్యులర్ ప్రోగ్రామర్‌తో పాటు ఇంజనీరింగ్‌లో బహుళ కోర్సులను అందిస్తున్నది.
చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!
అమ్మో.. నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?
కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది వీళ్లే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..