(Rythu Bazars) విశాఖపట్నం: రైతు బజార్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే ప్రయత్నంలో స్టాల్స్ కోసం రైతుల నుంచి అద్దె వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ యోచిస్తున్నది. రైతు బజార్లను వివిధ క్యాటగిరీలుగా వర్గీకరించి అధికారులు అద్దెలను నిర్ణయించారు. ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు అద్దెలు ఉండనున్నాయి. సీతమ్మధార, ఎంవీపీ కాలనీ రైతు బజార్ల కోసం స్టాల్ వినియోగదారు నుంచి నెలకు రూ. 3,000 వసూలు చేయాలని మార్కెటింగ్ శాఖ భావిస్తున్నది. కంచరపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక తదితర ప్రాంతాల్లో నెలవారీ అద్దె రూ.1000 నుంచి రూ.2000 వరకు ఉండనున్నది. అయితే, ఈ విధానం తమకు మరింత భారంగా తయారవుతుందని రైతులు అంటున్నారు. కరోనా, వరదల నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులపై అద్దెల రూపంలో భారం వేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విశాఖపట్నంలో ప్రస్తుతం 13 రైతు బజార్లు ఉన్నాయి. ప్రతి రైతు బజార్లో 100కి పైగా స్టాళ్లు ఉన్నాయి. రైతు బజార్లలో తమ ఉత్పత్తులను విక్రయించే కూరగాయల పెంపకందారులకు ప్రభుత్వం ఉచిత స్టాల్స్‌ను అందిస్తుంది. హోల్‌సేల్ మార్కెట్ నుంచి కూరగాయలు, ఇతర మార్గాల ద్వారా వాటిని రైతు బజార్లలో విక్రయించే వారికి అద్దె వసూలు చేస్తున్నారు. మునుపటిలా కాకుండా క్యారెట్, క్యాప్సికమ్‌లు, మిరపకాయలు, బీట్రూట్లు, ఇతర ఉత్పత్తులను విక్రయించడానికి స్టాల్స్ నడుపుతున్న వారు ఇప్పుడు సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. దాదాపు 200 మంది రైతులు కౌలు చెల్లించడానికి ముందుకు వచ్చారని మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీ పాపారావు తెలిపారు.
చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!
అమ్మో.. నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?
కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది వీళ్లే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..