(Ali on AP Govt) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనపై నటుడు అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పాలన చాలా బాగున్నదని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ అద్భుత పాలనతో తనకు భాగస్వామ్యం ఉంటే బాంగుండేదన్నారు. అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ సమన్యాయం చేస్తున్నారని కొనియాడారు. ఆన్ లైన్ టిక్కెట్ల విధానం, బెనిఫిట్ షోల వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై జగన్ సానుకూలంగానే ఉన్నారని భావిస్తున్నట్లు చెప్పారు.
తనకు కేఎల్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించడంపై అలీ స్పందించారు. డాక్టరేట్ ఇవ్వాలని కేఎల్ వర్శిటీ నిర్ణయించడం ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. సొంతూరిలో డాక్టరేట్ రావడం మరింత సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం తనకు మంత్రి పదవి ఇస్తే మరింత ఆనందముంటుందని అలీ తన మనసులోని మాటను బయటపెట్టారు.
చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!
అమ్మో.. నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?
కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది వీళ్లే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..