Bandla Ganesh | నేను 500 సార్లు ఆత్మహత్య చేసుకోవాలి.. ‘తెల్ల కాగితం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Bandla Ganesh | ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెల్ల కాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో నక్షత్ర కథానాయికగా పరిచయం అవుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Bandla Ganesh | ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెల్ల కాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో నక్షత్ర కథానాయికగా పరిచయం అవుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రమేష్ తన కష్టాల గురించి చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. జీవితంలో ఎప్పుడూ ఇతరుల గురించి కాకుండా మన గురించి, మన ఎదుగుదల గురించి ఆలోచించాలని సూచించారు.
‘‘జీవితంలో పక్కవారి గురించి ఎక్కువగా ఆలోచిస్తే మన ప్రయాణం ముందుకు సాగదు. మనం ఎలా పైకి వెళ్లాలి? ఏం సాధించాలి? అనేదే ఆలోచించాలి. ఇతరులు మనల్ని విమర్శించినా, ఇబ్బంది పెట్టినా వాటిని పట్టించుకోకుండా మన లక్ష్యం వైపు వెళ్లాలి. అదే మన గోల్’’ అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ బాధ పడ్డానని, అమ్మని తీసుకొచ్చానని, దుఃఖ పడ్డానని అంటున్నాడు. ఆయనలాగా నేను బాధ పడితే ఇప్పటికి 500 సార్లు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే నా గురించి రోజుకొకటి రాస్తారు. జీవితంలో పక్కోడి గురించి ఆలోచిస్తే, అసలు నేను షాద్ నగర్ లో ఉండేవాడిని కూడా కాదు.. నువ్వు (రమేష్) భీమవరంలో ఉండాలి. మన గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి. ఎదగడానికి ప్రయత్నించాలి. పక్కోడు మన గురించి ఏడవాలి, తిట్టాలి, మనం పైకి చేరుకోవాలి అని బండ్ల గణేష్ స్పష్టం చేశారు.
నిర్మాత కృష్ణ కొమ్మాలపాటితో తనకున్న అనుబంధాన్ని కూడా బండ్ల గణేష్ గుర్తుచేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయనతో తనకు స్నేహం ఉందని చెబుతూ.. కృష్ణ ఎంతోమందికి సహాయం చేస్తూ, సినిమా కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.‘కృష్ణ అన్న మనసు తెల్ల కాగితం. ప్రతి ఒక్కరూ ఆయనతో పని చేయించుకుని వదిలేశారు. ఆయన జీవితం వైకుంఠపాళిలా సాగింది. నిచ్చెన ఎక్కుతుంటే పాము కరిచింది. కానీ ఈసారి మాత్రం ఆయన పెద్ద నిచ్చెన ఎక్కి గోల్ కొడతారని నమ్ముతున్నాను అని బండ్ల గణేష్ అన్నారు. కృష్ణ తన వ్యాపారాన్ని సైతం పక్కనపెట్టి సినిమాల కోసం, స్నేహితుల కోసం ఎంతో సమయం కేటాయించారని ఆయన తెలిపారు. కుటుంబానికి దూరంగా ఉంటూ సినిమా కార్యాలయాలు, షూటింగులు, సినిమా పనులకే ఎక్కువ సమయం కేటాయించారని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | శీతాకాలంలో అధికమయ్యే వాయు కాలుష్యం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే..
Electric Rice coocker | ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదా.. నిపుణులు ఏమంటున్నారు..?
Brinda Karat | కార్పొరేట్ అనుకూల విధానాలతో వ్యవసాయ రంగానికి నష్టం : బృందా కారత్
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
AP News | నిత్యావసరాల ధరలు పెంచి విజన్ కబుర్లు ఎందుకు.. కూటమి సర్కారుపై వైసీపీ ఫైర్..!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

