Helicopter crash | జింబాబ్వేలో(Zimbabwe) హెలికాప్టర్ కూలిన(Helicopter crash | )ఘటనలో ఏడుగురు మృతి చెందారు. జింబాబ్వే ఈశాన్య మారోండెరా గ్రామీణ ప్రాంతంలో బుధవారం ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ప్రముఖ వ్యాపారవేత్త, నలుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో సహా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురూ మరణించారని ప్రభుత్వ ప్రతినిధి నిక్ మంగ్వానా తెలిపారు. సమాచారం అందిన వెంటనే అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారన్నారు.
ఈ ప్రమాదంలో ఎవరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని మంగ్వానా చెప్పారు. అయితే విమానంలో ఉన్న ప్రయాణికుల సంఖ్యపై పోలీసుల కథనానికి, ప్రభుత్వ ప్రతినిధి చెప్పిన దానికి పొంతన లేకపోకపోవడం గమనార్హం. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.