UPI Payments | సెప్టెంబర్‌లోనూ కొనసాగిన హవా.. 24 బిలియన్లు దాటిన యూపీఐ పేమెంట్స్..!
UPI Payments | దేశంలో 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)' తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. సెప్టెంబర్ నెలలో కూడా యూపీఐ లావాదేవీలు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)' గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల (UPI Transactions) సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 23 శాతం పెరిగి 24.07 బిలియన్లకు చేరుకుంది.
UPI Payments : దేశంలో ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)’ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. సెప్టెంబర్ నెలలో కూడా యూపీఐ లావాదేవీలు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)’ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల (UPI Transactions) సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 23 శాతం పెరిగి 24.07 బిలియన్లకు చేరుకుంది. ఇక లావాదేవీల విలువ 18 శాతం వృద్ధితో రూ.29.37 లక్షల కోట్లుగా నమోదైంది.
సెప్టెంబర్‌లో ప్రతిరోజూ సగటున 802 మిలియన్ల లావాదేవీలు జరుగగా వాటి విలువ సుమారు రూ.97,913 కోట్లుగా ఉంది. ఆగస్టు నెలలో నమోదైన 24.51 బిలియన్ల లావాదేవీలతో పోలిస్తే సెప్టెంబర్‌లో స్వల్ప తగ్గుదల కనిపించినా వార్షిక వృద్ధి మాత్రం బలంగా కొనసాగుతున్నది. ఇదే సమయంలో ఐఎంపీఎస్ ద్వారా జరిగిన లావాదేవీల విలువ కూడా 18 శాతం పెరిగి రూ.7.06 లక్షల కోట్లకు చేరింది. ఇదిలావుంటే రూ.2,000 దాటిన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4% ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)’ విధించాలన్న ప్రతిపాదనను వ్యాపారవర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం చిన్న, మధ్యతరహా వ్యాపారులపై భారం మోపుతుందని, డిజిటల్ చెల్లింపుల స్వీకరణను దెబ్బతీస్తుందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తంచేశాయి. దీనికి నిరసనగా అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’ పాటించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (CAIT) సహా పలు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో చాందినీ చౌక్ ఎంపీ, సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ నేతృత్వంలోని సుమారు 20 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైంది.
ఈ భేటీ తర్వాత వ్యాపార సంఘాలు తమ నిరసన పిలుపును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ఈ కొత్త ఛార్జీల విధానం కేవలం రూ.2,000 మించిన మర్చంట్ (పీ2పీ) లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. దేశంలో జరిగే మొత్తం యూపీఐ మర్చంట్ లావాదేవీలలో 96 శాతానికిపైగా రూ.2,000 లోపే ఉంటున్నాయని, కాబట్టి అత్యధిక శాతం లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని వివరించింది. అంతేగాక నెలవారీగా రూ.1 లక్షవరకు యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు కూడా ఈ ఎండీఆర్ నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టంచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

