దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగులను నియమించు కోవడానికి సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తాము 1,25,000-1,50,000 మేర కొత్త నియామకాలు జరుపుతామని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ తెలిపారు.
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10,431 కోట్ల నికర లాభాన్ని గడించింది.