TCS CEO Salary | దేశంలోనే మేటి టీసీఎస్.. సీఈవో వేతనం అతి తక్కువ.. ఎంతంటే?!
TCS CEO Salary | టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) దేశంలోనే అతిపెద్ద ఐటీ, సాఫ్ట్వేర్ సేవల సంస్థ. కానీ, ఆ సంస్థ సీఈవోగా వైదొలగనున్న రాజేశ్ గోపినాథన్ గత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న వేతనం టాప్-5 సీఈవోల్లో అతి తక్కువ.
TCS CEO Salary | ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో కం ఎండీగా ఉన్న రాజేశ్ గోపినాథన్ రాజీనామా చేశారు. ఆయన వారసుడిగా కే కృతివాసన్ సీఈవోగా వ్యవహరిస్తారని టీసీఎస్ ప్రకటించింది. అయితే, వచ్చే సెప్టెంబర్ 15 వరకు రాజేశ్ గోపీనాథన్ సీఈవోగా కొనసాగుతారని వెల్లడించింది. ఆరేండ్లుగా టీసీఎస్ సీఈవోగా పని చేసిన రాజేశ్ గోపినాథన్ వేతనం ఏటా రూ.25.75 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన అందుకున్న వేతనం ఇది. అంతకుముందు 2020-21తో పోలిస్తే 26 శాతం వేతనం పెరిగింది. దేశంలోని ఇతర టెక్ దిగ్గజ సంస్థల సీఈవోలతో పోలిస్తే రాజేశ్ గోపినాథన్ శాలరీ కాసింత తక్కువే.
రాజేశ్ గోపినాథన్తో పోలిస్తే శాలరీ ప్యాకేజీ విషయంలో హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సీ విజయ్‌కుమార్ మొదటి స్థానంలో నిలిచారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.123.13 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. దేశంలోని ఐదు అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో గరిష్ట వేతనం అందుకున్న సీఈవో విజయ్‌కుమార్ కావడం ఆసక్తికర పరిణామం. రెండో స్థానంలో ఉన్న విప్రో సీఈవో థెర్రీ డెలాఫోర్ట్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.79.8 కోట్ల వేతనం పొందారు. ఇన్పోషిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ.71.02 కోట్ల వేతన ప్యాకేజీతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. నాలుగో స్థానంలో ఉన్న టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ వేతనం రూ.63.4 కోట్లు. ఐదో స్థానంలో రాజేష్ గోపినాథన్.. అయితే ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్‌గా ఇటీవల రాజీనామా చేసిన మోహిత్ జోషి, వచ్చే డిసెంబర్లో టెక్ మహీంద్రా సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
టీసీఎస్.. దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో రెండో స్థానం. రిలయన్స్ తర్వాతీ స్థానం టీసీఎస్‌దే. ఐటీ దిగ్గజాల్లో అగ్రస్థానం టీసీఎస్‌దే. కానీ, ఆ సంస్థకు సీఈవోగా సారధ్యం వహిస్తున్న రాజేశ్ గోపినాథన్.. దేశంలోని ఐదు టెక్ దిగ్గజ సంస్థల సీఈఓల్లో అతి తక్కువ వేతన ప్యాకేజీ కలిగి ఉండటం ఆసక్తికర పరిణామం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

