Market Capitalisation | గతవారం ట్రేడింగ్‌లో టాప్-10 స్టాక్స్‌లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.49,231.44 కోట్లు నష్టపోయింది. వాటిల్లో ఎఫ్ఎంసీజీ మేజర్ హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) భారీగా నష్టపోయింది. గత వారం ట్రేడింగ్‌లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 159.18 పాయింట్ల (0.26 శాతం) నష్టంతో ముగిసింది. హెచ్యూఎల్తోపాటు భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ భారీగా నష్టపోయాయి. మరోవైపు టీసీఎస్, ఎస్బీఐ, రిలయన్స్, ఇన్ఫోసిస్ లాభాలతో ముగిశాయి. మిగతా ఆరు స్టాక్స్ కంటే ఈ నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువగా రూ.35,840.35 కోట్లు పెరిగింది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,918.48 కోట్లు నష్టపోయి రూ.6,05,759.87 కోట్లతో సరిపెట్టుకున్నది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,540.63 కోట్ల పతనంతో రూ.4,29,474.82 కోట్లకు చేరుకున్నది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.11,420.89 కోట్లు పతనంతో రూ.4,60,932.38 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.6,863.37 కోట్ల నష్టంతో రూ.5,95,885.63 కోట్ల వద్ద నిలిచింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,255 కోట్లు నష్టపోయి రూ.9,23,933.45 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.1,233.07 కోట్ల పతనంతో రూ.4,91,080 కోట్ల వద్ద ముగిసింది.
టీసీఎస్ ఎం-క్యాప్ రూ.19,612.52 కోట్లు లబ్ధి పొంది రూ.12,93,639.32 కోట్లకు దూసుకెళ్లింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.7,585.92 కోట్లు వృద్ధి చెంది రూ.4,93,486.41 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.4,938.8 కోట్లు పుంజుకుని రూ.15,80,653.94 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,703.11 కోట్లు పెరిగి రూ.6,76,638.36 కోట్లకు పెరిగింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ మొదటి స్థానంలో రిలయన్స్ నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.