ప్రచారాన్ని ప్రారం భించిన సర్పంచ్ అభ్యర్థి ఆకస్మికంగా మృతి చెందడం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్‌ఠాణా ఆర్అండ్ఆర్ గ్రామంలో విషాదం నింపింది.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సెస్ కార్యాలయం వరకు సెస్ కార్మికులు ర్యాలీ తీసి, కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ దక్షిణ ప్రాకారం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల్లో భాగంగా పాత నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే కళాభవన్, కల్యాణకట్ట, ఆలయ ఈవో �
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట చేతికి వచ్చే సమయాన వర్షాలకు నేల వాలడంతో ఆ రైతు దిగులు చెందాడు. పెట్టుబడైనా వస్తదో రాదోనని ఆలోచిస్తూ పొలంలోనే కుప్పకూలి అక్కడే ప్రాణాలు వదిలాడు.
ఏజెంట్ మోసంతో ఎడారి దేశంలో చిక్కుకొని అష్టకష్టాలు పడుతూ కాపాడాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన గురవయ్య అలియాస్ సతీశ్ అర్థిస్తున్నాడు.
అయ్యా.. సీఎం రేవంత్‌రెడ్డిగారు.. రిటైర్డ్ ఉద్యోగులను మనోవేదనను ఆలకించండి. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. బీపీ, షుగర్లు పెరిగిపోతున్నాయి.
ఇంటికి మీదికి వచ్చిన కోతులను ఓ వృద్ధుడు తరిమికొట్టే ప్రయత్నం చేశాడు. అవిఎదురుదాడికి సిద్ధం కావడంతో పరుగెత్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన రైత
‘యూరియా కోసం ఇంకెన్ని రోజులు తిరగాలి. అసలే నా పాణం సక్కగలేక దవాఖానల పొంటి తిరుగుతున్న. అసలు యూరియా ఇస్తరా.. చావమంటరా..? సచ్చిపోయినంక బస్తా ఇస్తా అంటే పెట్రోల్ తాగి సచ్చిపోత’ అంటూ కోనరావుపేట మండలం పల్లిమక్�
Urea | మంగళవారం తెల్లవారుజామునే తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం ఎదుట మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు యూరియా కోసం బారులు తీరారు. అదేవిధంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రామైక్య సంఘం�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఓవైపు యూరియా, మరోవైపు కరెంట్ కోసం తండ్లాడుతున్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట వాగు శివారులో కరెంట్ లేక జనరేటర్లు పెట్టుకుని వ్యవసాయ మోటర్లు నడిపిస్తూ ఎండుతున�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన మానుక లక్ష్మణ్ యూరియా కోసం వేచి చూసి కడుపుమండి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.