కోనరావుపేట, సెప్టెంబర్ 28 : ఇంటికి మీదికి వచ్చిన కోతులను ఓ వృద్ధుడు తరిమికొట్టే ప్రయత్నం చేశాడు. అవిఎదురుదాడికి సిద్ధం కావడంతో పరుగెత్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన రైతు బొడ్డు రాజయ్య(60) ఇంటిమీదకు ఆదివారం కోతుల గుం పులు వచ్చాయి. వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేశాడు.
అవి ఒక్కసారిగా రాజయ్య మీదకు ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించగా, పరుగెత్తి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.