ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 4: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన మానుక లక్ష్మణ్ యూరియా కోసం వేచి చూసి కడుపుమండి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది కంటగింపుగా భావించిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో అతడిపై బీఆర్ఎస్ కార్యకర్తగా ముద్రవేశారు.
రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కండ్ల ముందు పంట చేతికందకుండా పోతుంటే తట్టుకోలేక కడుపు మండి, ప్రశ్నించిన రైతుపై కాంగ్రెస్ నేతలు కన్నెర్ర జేయడమేమిటని పలువురు అసహనం వ్యక్తంచేశారు. ఎస్ఐ రాహుల్‌రెడ్డిని వివరణ కోరగా.. ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, లక్ష్మణ్‌పై కేసు నమోదైనట్టు తెలిపారు.