గంభీరావుపేట, సెప్టెంబర్ 20: ఎంత ప్రయత్నించినా సరైన ఉద్యోగం రావడం లేదని తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేటలో శనివారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు కథనం మేరకు.. రాజుపేటకు చెందిన రమేశ్ కవిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు కాగా, ప్రియాంక (24) మొదటి సంతానం. రమేశ్ తనకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటుండగా, కవిత బీడీలు చుడుతూ కు టుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రియాం క మూడేండ్ల కిందట హైదరాబాద్‌లో బీటెక్ పూర్తిచేసింది. ఇంజినీరింగ్ విద్య కోసం తండ్రి సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చు చేశాడు. బీటెక్ పూర్తయిన తర్వాత తల్లిదండ్రులపై ఆధారపడొద్దనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోనే ఏడాదిపాటు చిన్న ఉద్యోగం చేసింది. జీతం సరిపోవడం లేదని మానేసి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రి యాంక శనివారం ఇంట్లో ఉరేసుకున్న ది. కుటుంబ సభ్యులు వచ్చి చూసే సరి కి మృతిచెందింది. తండ్రి రమేశ్ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్టు ఎస్సై అనిల్ తెలిపారు.
కరెంటు షాక్‌తో రైతు మృతి
మేడిపల్లి, సెప్టెంబర్ 20: కోతుల బెదద నుంచి పంటను కాపాడేందుకు విద్యుత్ తీగలు అమర్చి.. వాటికి తాకి రైతుల బలైనట ఘటన జగిత్యాల జిల్లా లో చోటుచేసుకున్నది. ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి వివరాలిలా ప్రకారం.. భీమారం మండలం పసునూరుకు చెందిన మా లోతు సత్యనాయక్ (51) శనివారం వేకువజామున తన పంట పొలానికి వెళ్లాడు. అంతకు ముందే అక్కడ కోతుల బెడద కోసం తాను అమర్చిన విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య భూమిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు.