దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. ఈ ఏడాదిలో మరిన్నిసార్లు వడ్డీరేట్లను పెంచకతప్పదని అమెరికా ఫెడరల్ రిజర్వు ఇచ్చిన సంకేతాలు మార్కెట్లను పతనం వైపు నడిపించాయి.
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ సమావేశాల మినట్స్ విడుదలకానుండటంతో మదుపరులు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కొత్త రికార్డుస్థాయికి పెరిగిన తర్వాత లాభాల స్వీకరణ జరుగుతున్న నేపథ్యంలో గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.1 శాతం మేర నష్టపోయి 18,497 పాయింట్ల వద్ద ముగిసింది.
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు తక్కువ మోతాదులోనే ఉంటుందంటూ ఫెడరల్ రిజర్వ్ కమిటీ మీటింగ్ మినిట్స్ ద్వారా వెల్లడికావడంతో గత వారం ఆ దేశపు సూచీల ర్యాలీ ప్రభావం ఇక్కడ కూడా కన్పించింది.