Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్ అందించాలని సబ్‌స్టేషన్ ముట్టడి
Farmers Protest | ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన వరి పంట చేతికొచ్చిన సమయంలో కరెంటు కోతలతో రైతన్న తీవ్రంగా నష్టపోతున్నాడని నిరసిస్తూ మక్తల్ ఉప విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని రైతులు ముట్టడించి జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.
మక్తల్ : ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన వరి పంట చేతికొచ్చిన సమయంలో కరెంటు కోతలతో రైతన్న తీవ్రంగా నష్టపోతున్నాడని నిరసిస్తూ మక్తల్ ( Maktal ) ఉప విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని రైతులు ముట్టడించి జాతీయ రహదారిపై ధర్నా ( Dharna ) చేపట్టారు. మండలంలోని సంగం బండ, మద్వార్ గ్రామాలకు చెందిన రైతులు కార్యాలయాన్ని ముట్టడించి, సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ధర్నాకు దిగారు. అనంతరం సబ్ స్టేషన్ ఎదుట 167 జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు.
రైతులు లక్ష్మి కాంత్ రెడ్డి, సంతోష్ రెడ్డి, అంజప్ప, అర్జున్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని వాపోయారు. అసలే వర్షాకాలంలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నకు, కరెంటు కోతలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. జాతీయ రహదారిపై ధర్నా విషయాన్ని తెలుసుకున్న మక్తల్ సీఐ రామ్ లాల్ మక్తల్ పట్టణ రెండో ఎస్సై రేవతి రైతుల వద్దకు చేరుకుని మాట్లాడారు. విద్యుత్ అధికారుల నుంచి స్పష్టమైన హామీ రావడంతో రైతులు ఆందోళనను విరమించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

