రాష్ట్రంలో వేసవి రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్�
రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు ఘననీయంగా పెరిగాయి. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా భిన్నవాతావరణం కొనసాగుతున్నది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ, రాత్రి చలి తీవ్రత ఉంటుంది. కిందిస్థాయిల్లో గాలులు వీయడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటున్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది.
రాష్ట్రంలో రాగల మూడు, నాలుగు రోజుల పాటు పొగమంచు ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న చెప్పారు. తూర్పు, ఆగ్నేయ గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో రికార్డుస్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రత 5.2డిగ్రీలుగా నమ�
Low pressures | ఆంధ్రప్రదేశ్ను వరుస అల్పపీడనాలు కలవరపెడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరంవైపు వచ్చే క్రమంలో బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికా
Good News | ఏపీ ప్రజలకు వాతావరణశాఖ గుడ్న్యూస్ తెలిపింది. గత కొన్ని రోజులుగా వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. 27 జిల్లాల్లో సింగిల్ డిజిట్ నమోదైంది. ఇక ఆరు జిల్లాల్లో 13 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఫెంగల్ తుఫాను తీరం దాటడంతో ఇప్పట్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండవని అంతా భావిస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆవర్తనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీనిప్రభావంతో మంగళవారం నుంచి మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.