Weather Report | హైదరాబాద్ మే 10 (నమస్తే తెలంగాణ): ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావారణశాఖ చల్లని కబురు చె ప్పింది. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని శనివారం ప్రకటనలో పేర్కొన్నది.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది. ఆదివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నదని వెల్లడించింది. ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.