హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి వాయుగుండంగా మారిందని, ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. పారాదీప్నకు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వెల్లడించింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని పేర్కొంది.
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి, 30 డిగ్రీ సెల్సియస్‌గా నమోదవుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో 4 రోజులు తేలికపాటి నుంచి మోస్త్తరు వర్షాలు కురుస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.