Southwest Monsoon | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు బుధవా రం నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించా యి. దీంతో రానున్న రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో అత్యధికంగా 127.0 మి.మీ వర్షపాతం నమోదైంది.
అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురులో 70.1 మి.మీ. నమోదైంది. 31 నుంచి జూన్ 7 వరకు రుతుపవనాలు బలహీనంగా ఉండనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నది. రైతులు ఇందుకు అనుగుణంగా వ్యవసాయ పనులను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. జూన్ 10 తర్వాత తదుపరి దఫా రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తాయన్నది.