అమరావతి: అకాలవర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ( Andhra Pradesh) పలు జిల్లాలో భారీ వర్షాలు( Heavy Rains ) , మరికొన్ని జిల్లాలో మోస్తారు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ( Meteorological Department) పలు జిల్లాలకు రెడ్ ( Red alert ) , ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
రాగల 2, 3 గంటల్లో కృష్ణా, ప్రకాశం, తిరుపతి , నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 60 నుంచి 85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖ ఎండీ రోనంకి కూర్మనాథ్తో హోం మంత్రి అనిత ( Minister Anita) ఫోన్లో మాట్లాడి వర్షాలపై ఆరాతీశారు.
అనంతరం ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. విద్యుత్ సరఫరా, తాగునీటికి ఆటంకం లేకుండా చూడాలని సూచించారు.